ADB: గుడిహత్నూర్ మండలంలోని దామన్ గూడ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నెరడిగొండ ఎమ్మెల్యే నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, త్రాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు.