KMM: మధిర పట్టణంలోని 18వ డివిజన్లో ఇవాళ వార్డు సభ నిర్వహించారు. ఈ వార్డు సభకు కౌన్సిలర్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ కోనధని కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.