GDWL: జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ఉండవెల్లిలో పర్యటించి, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. పనుల పురోగతిపై లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉండవెల్లి ఎంపీడీఓ (MPDO) కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.