KMM: జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అన్నారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ను కలిసి వినతి పత్రం అందించారు. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులను వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రులను దోపిడీ గురి చేస్తున్నాయని పేర్కొన్నారు.