MNCL: చెన్నూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.