MDK: చిన్న శంకరంపేట మండలంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. ఖాజాపూర్ సర్పంచ్ బాలస్వామి, ఉపసర్పంచ్ అక్బర్, కాజాపూర్ తండాకు చెందిన ప్రియనాయక్ సహా సుమారు 80 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంత రావు, మండల నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.