ADB: మాదక ద్రవ్యాల సాగు చట్టరీత్య నేరమని మావల SHO రాహుల్ కాంత్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి గేడం జంగును సోమవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు నుంచి రూ. 5 వేల విలువగల రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విత్తనాలు తెచ్చుకుని సాగు చేస్తున్నట్లు విచారణలో వెల్లడించారు.