మంచిర్యాల జిల్లా కేంద్రం గోపాల వాడలో ఇంటి తలుపు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అద్దం పగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఇవాళ నాగరాజు తన ఇంటి డోర్ లాక్ కావడంతో తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తలుపుకున్న అద్దం పగిలి కుడి చేతికి లోతైన గాయమైనట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. వెంటనే ఆయనను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.