MNCL: జన్నారం మండలంలోని పొన్కల్, రెండ్లగూడ, మొర్రిగూడ, దండేపల్లి మండల కేంద్రంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ రాములు మంగళవారం సందర్శించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు నిబంధనల ప్రకారం తాలు, తప్ప, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని తెలిపారు.