GDWL: ఎనిమిది నెలల బేసిక్ శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘ఆర్య’ను జిల్లాకు కేటాయించారు. ఐఐటీఏ మొయినాబాద్లో శిక్షణ పొందిన ‘ఆర్య’ పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం సాధించిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఎస్పీకి ఆర్యను పరిచయం చేశారు.