NRPT: కొత్తపల్లి మండలం తాండ గ్రామంలో భారీ వర్షానికి పిడుగు పడి ఉప సర్పంచ్ రాజు నాయక్‌కు చెందిన రెండు ఎద్దులు మృతి చెందాయి. సుమారు రూ.1,20,000 విలువైన ఎద్దులు చనిపోవడంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. వ్యవసాయానికి ఆధారమైన మూగజీవాలను కోల్పోయి రోడ్డున పడ్డానని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.