BHPL: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని మంజూరునగర్లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జెన్కో డీఈ రామకృష్ణరెడ్డి- మనోజ దంపతులు స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించారు.