ADB: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ప్రవీణ్ మాదిగ పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్లో ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ పోరాటంలో మాదిగలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.