RR: ప్రజాపాలన-ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.