ADB: సమాజంలో చైతన్యం తెచ్చేది ఉపాధ్యాయులేనని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త అన్నారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీలో నిర్వహించిన గురుపూజోత్సవ ,ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో వారు పాల్గొన్నారు. గురువు ఇచ్చిన జ్ఞానంతోనే ప్రతి ఒక్కరూ అభివృద్ధి పథంలో నడుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.