KNR: ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని పూర్తిగా సైన్స్ మ్యూజియంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఆధునికంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. అవసరమైన నిధులు కేటాయిస్తామని, పారదర్శకంగా సద్వినియోగం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియంను శనివారం అదనపు కలెక్టర్, కమిషనర్ సందర్శించారు.