MDK: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్మికుల పక్షాన సీఐటీయూ అలుపెరుగని పోరాటం చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. మెదక్లో జిల్లా సీఐటీయూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీలలో నిర్వహించిన 5వ సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలన్నారు.