NLG: చిట్యాల మండలం నేరడ గ్రామంలో పవర్ లూమ్స్ను చిట్యాలకు చెందిన ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు శనివారం సందర్శించారు. పవర్ లూమ్స్, హ్యాండ్లూమ్స్ పద్ధతుల్లో బట్టలు తయారయ్యే విధానాన్ని విద్యార్థులు ఈ సందర్భంగా తెలుసుకున్నారు. థియరీ ద్వారా బట్టలు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్న విద్యార్థులు దానిని ప్రత్యక్షంగా వీక్షించారు.