ప్రకాశం: కొత్తపట్నం మండలం గుండమాల తీరం వద్ద శనివారం మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, బాలచందర్ మృతి చెందడంపై మంత్రి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గుండమాల తీరం వద్ద నిమజ్జనోత్సవం సందర్భంగా వీరు మృతి చెందినట్లు సమాచారం అందుకున్న, మంత్రి స్వామి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిమజ్జనం సమయంలో భక్తులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.