BDK: బూర్గంపాడు మండలంలో నాకిరీపేట పంచాయతీ పరిధిలో డ్రైనేజీ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని సీపీఎం పార్టీ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీల కోసం ప్రజలు అనేకసార్లు గ్రామపంచాయతీ అధికారులకు చెప్పినా గాని పట్టించుకోవటం లేదని స్థానికులు తెలిపారు. వర్షం నీళ్ళు రోడ్లు పైనే ఉండటం వల్ల నడవడం కష్టతరంగా ఉందన్నారు.