SRD: రుద్రారం శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన కోరుకున్నారు.