SKLM: ఆమదాలవలస పట్టణంలో శనివారం పలు ఎరువుల గోడౌన్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ సంతోష్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఎరువుల దుకాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలన్నారు. మండల వ్యవసాయాధికారి మెట్ట మోహన్ రావు ఉన్నారు.