PLD: ప్రజా రక్షణకై నిరంతరం పాటుపడే పోలీస్ సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్రోసూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హనుమంత చారి కుటుంబాన్ని ఆదుకోవడానికి, ఆయన భార్య అనితకి రూ.1,00,000 సహాయ నిధిని చెక్కు రూపంలో అందజేశారు.