VSP: చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సోమవారం ఉదయం 7వరకు దర్శనలు నిలిపి వేస్తున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా పంచామృతాభిషేకం అనంతరం గుడి మూసి వేస్తారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారు జామున సంప్రోక్షణ నిర్వహించి శ్రీ అమ్మవారికి 5కు ప్రాతః కాల పంచామృతాభిషేకం అనంతరం 7కు తిరిగి దర్శనములకు అనుమతిస్తారు.