మేడ్చల్: గాజులరామారం పరిధి చిత్తారమ్మ టెంపుల్ వెనకాల గల్లీలో రహదారి నిర్మాణం పూర్తికాక, అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం పనులు ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారని స్థానికుల ఆరోపిస్తున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పనులను అధికారులు ఆలస్యం చేయడంతో తీవ్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆగ్రహిస్తున్నారు.