KMM: గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఖమ్మం గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన శోభాయాత్రను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి నిమజ్జనం సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్ ఉన్నారు.