KMM: కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నాయకుడు నూకల మల్లయ్య కుమారుడు సాయికిరణ్ యాదవ్ శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.