CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గో సంరక్షణ ట్రస్ట్‌కి తిరుపతికి చెందిన దాత విజయ దీపిక 1,11,116/- రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు.