KDP: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గత 10 రోజులుగా పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు వేలంపాట శనివారం కమ్మ పాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన వేలూరి వెంకటసుబ్బయ్య నాయుడు 5 కిలోల లడ్డును 70 వేలకు వేలంపాట దక్కించుకున్నాడు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.