SRCL: వినాయక నిమజ్జనానికి సిరిసిల్ల పట్టణానికి 400 మంది పోలీస్ అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జనం విజయవంతంగా పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు.