W.G: భీమవరంలోని 82 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరగా నిర్మాణం చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం పట్టణ నాయకులు వైకుంఠరావు డిమాండ్ చేశారు. శనివారం భీమవరం సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. టిడ్కో ఇళ్లకు లబ్ధిదారులు ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఏళ్లు దాటినా ఇంతవరకు లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు.