ప్రకాశం: పామూరు సచివాలయం 1లో ఈనెల 8వ తేదీ నుండి ఆధార్ సేవలు అందుబాటులోకి వస్తున్నట్లు ఎంపీడీవో బ్రహ్మయ్య శనివారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఒకటవ సచివాలయంలో కొత్తగా ఆధార్ తీసుకోవాల్సిన వారు, ఆధార్ కార్డులో చిరునామా, పేరు సవరణలు పలు సేవలు వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. కాగా, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.