కృష్ణా: పామర్రు పట్టణంలో శనివారం చవితి పందిళ్లను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జనసేన పార్టీ ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ దర్శించుకున్నారు. గణనాధునికి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆయా కమిటీల ఆధ్వర్యంలో అన్నసమారాధనలు ప్రారంభించారు. అనంతరం నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.