CTR: పుంగనూరులో శనివారం ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హేమ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యుత్ యాజమాన్యం విడుదల చేసిన నోటిఫికేషన్, రెగ్యులరైజేషన్ పై కార్మికుల అభిప్రాయ సేకరణ చేపట్టారు. అనంతరం పీఆర్సీ – 22 అరియర్స్, సర్వీస్ ఇన్సెంటివ్ వంటి అంశాలపై చర్చించారు.