CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్గా కృష్ణం నాయుడు గత రెండు రోజుల మునుపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.