PDPL: రైతులకు సరిపడా యూరియా సక్రమంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు సరఫరా చేసిన యూరియా, ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలు తెలుసుకున్నారు.