ELR: జంగారెడ్డిగూడెం కోర్టు ఛాంబర్లోకి శనివారం 7 అడుగుల కోడినాగు ప్రవేశించింది. కోర్టు హాల్లో విధుల్లో ఉన్న అటెండర్ పామును గమనించి పక్కనున్న వారికి సమాచారం అందించారు. దగ్గరలో ఉన్న స్నేక్ సేవియర్ సొసైటీ సంస్థకు సమాచారం అందించగా సంస్థ అధ్యక్షులు చదలవాడ క్రాంతి సమీపానికి చేరుకుని ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకుండా పాముని సురక్షితంగా పట్టుకున్నారు.