ఆసియా కప్‌లో టీమిండియా స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. తాజాగా బీసీసీఐ ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన జెర్సీని విడుదల చేసింది. ఈ కొత్త జెర్సీపై కేవలం ఆసియా కప్ పేరు, లోగో.. అలాగే బీసీసీఐ లోగో, ఇండియా అని మాత్రమే ముద్రించారు. సాధారణంగా, భారత జట్టు జెర్సీలపై ప్రధాన స్పాన్సర్ లోగో ఉంటుంది, కానీ ఈసారి దాని స్థానంలో ఖాళీగా ఉంది.