WGL: పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలోని పత్తి వరి మొక్కజొన పంటలను శనివారం సీనియర్ శాస్త్రవేత్త , కోఆర్డినేటర్ విజయ భాస్కర్ పరిశీలించి చీడపీడ నివారణకు సంబంధించి పలు సూచనలు చేశారు. పత్తి పంటలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వడలు తెగులు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3గ్రా. లీ నీటిలో కలిపి మొక్క మొదలు తడిచేలా పిచికారి చేసుకోవాలని, రైతులకు వివరించారు.