HNK: రక్తదానం మనిషి చేయగలిగే గొప్ప సేవ అని కుడా ఛైర్మన్ ఇనుగాల వెంకట్రాం రెడ్డి అన్నారు. కుడా ఛైర్మన్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా.. ఇనుగాల ట్రస్ట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మకూరులో శనివారం మెగా రక్తదాన శిబిరం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. 300 యూనిట్ల రక్తం సేకరించగా.. వెయ్యి మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్ అందజేశారు.