అనంతపురంలోని జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు డ్రగ్స్, గంజాయిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈగల్ సెల్ సబ్ హనుమంతు మాట్లాడుతూ.. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, చట్టపరమైన పరిణామాలను వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.