ATP: గుత్తిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కృష్ణ ప్రసాద్ బదిలీపై వెళుతుండడంతో శనివారం విశ్రాంత ఉద్యోగులు వారిని ఘనంగా సన్మానించారు. పెన్షనర్స్ అసోసియేషన్ కోశాధికారి జన్నే కుల్లాయి బాబు మాట్లాడుతూ.. డాక్టర్ కృష్ణ ప్రసాద్ 3 ఏళ్లు ప్రజలకు సేవలు అందించారన్నారు. డిప్యూటీ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా ప్రమోషన్ వచ్చి, చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్నారు.