WGL: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాయపర్తి మండలం కొత్తూరు గ్రామ జడ్పిహెచ్ఎస్, ఎంపిపి.పాఠశాల ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సన్మానించారు. హెచ్ఎం విఠోబ మాట్లాడుతూ.. పాఠశాలలు భావి భారత పౌరులను తీర్చిదిద్దే దేవాలయాలని, సమాజ నిర్మాణం తరగతి గదులలోనే జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.