NRML: ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యోగ పోటీల కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో యోగ గురువు అన్నపూర్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.