NZB: సిరికొండ మండలం పెద్దవాల్గేట్లో వరద బాధితులకు సిరికొండ కృషి సంఘం తమవంతు సాయాన్నిఅందించింది. ఇటీవల వరదల వల్ల నష్టపోయిన 8 కుటుంబాలకు రెండు క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల పప్పు పంపిణీ చేసింది. ఈ సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని బాధితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సువర్ణ, సీసీలు, కృషి సంఘం అధ్యక్షురాలు పాల్గొన్నారు.