MDK: తూప్రాన్ పట్టణంలో శనివారం 100 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి తెలిపారు. వినాయక నిమజ్జనం పురస్కరించుకొని పెద్ద చెరువులో వేసిన వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగించినట్లు వివరించారు. వార్డుల్లో తడి పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు.