నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి శనివారం పలు శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ, హౌసింగ్ కార్యాలయాల పనితీరును సమీక్షించి, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై రూపొందించిన నివేదికలను పరిశీలించారు.