VKB: యాలాల మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఇవాళ భవన నిర్మాణానికి గాను గతంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం, భూమిని పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 50 లక్షల అంబేద్కర్ భవనానికి మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.