AP: ఈనెల 9న వైసీపీ రైతు పోరు బాట కార్యక్రమం చేపట్టనుంది. ఏపీలో రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా అన్నదాత పోరు పోస్టర్ను వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంో నియంతృత్వ పాలన నడుస్తోందని.. రైతులు యూరియా అడిగితే వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.