SRPT: తుంగతుర్తి వ్యవసాయ డివిజన్ పరిధిలో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయితీలపై వ్యవసాయ పనిముట్లు 40శాతం నుంచి 50శాతం సబ్సిడీపై అందజేయనున్నట్లు ఏడీఏ ఎల్.రమేష్ బాబు శనివారం తెలిపారు. 12 రకాల వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయన్నారు. కావాల్సిన రైతులు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.